తమిళనాడులో విజృంభిస్తోన్న కరోనా

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 508 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4058కు చేరుకున్నది. చెన్నైలో బాధితుల సంఖ్య 2,008కు పెరిగింది.  చెన్నై నగరంలో ఇవాళ ఒక్కరోజే 279 మందికి వైరస్‌ సోకింది. చెన్నై కోయంబేడు మార్కెట్‌లోనే అత్యధికంగా వెయ్యి పాజిటివ్‌ కేసులు నమోదుకావడం గమనార్హం.  కరోనా వల్ల మంగళవారం ఇద్దరు మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి 33 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకొని 1485 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.