ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు మిషన్‌కు భారత్ శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్త దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. దీంతో భారత్‌కు చెందిన విద్యార్థులు, యాత్రికులు, ఇతరులు వేల సంఖ్యలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. వీరిని వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాయు, జల మార్గాల ద్వారా వీరిని తరలించేందుకు చర్యలు చేపట్టింది. దాదాపు 1 లక్ష 90 వేల మంది భారతీయులు తిరిగి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి పెట్టుకున్నారు. వీరి తరలింపునకు చర్యలు చేపట్టిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న నేపథ్యంలో యూరోప్ దేశాల నుంచి తీసుకువచ్చే వారి వద్ద నుంచి రూ. 50 వేలు, యూఎస్ నుంచి తీసుకువచ్చే వారి వద్ద నుంచి రూ. లక్ష వసూలు చేస్తుంది. పశ్చిమ ఆసియా, మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని జలమార్గాల్లో తరలించనున్నారు. గల్ఫ్ వార్ త్వరాత ఎయిర్ ఇండియా ఇంత పెద్దఎత్తున కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి.
గల్ఫ్ వార్ తర్వాత ఇదే అతిపెద్ద తరలింపు