లోక్‌సభ రేపటికి వాయిదా..

లోక్‌సభలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, విపక్షాల సభ్యులు.. బడ్జెట్‌ అంశంపై కొనసాగుతున్న చర్చను తప్పుదోవపట్టిస్తూ.. పదేపదే వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట్టుకొని, ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలని పట్టుబట్టారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం, ఢిల్లీ అల్లర్లపై చర్చిద్దామని స్పీకర్‌ ఓం బిర్లా సర్దిచెప్పినా వినని విపక్ష సభ్యులు.. సభలో గందరగోళం సృష్టించారు. విపక్షాల ఆందోళనల మధ్యే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకింగ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం, స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.