పట్టణ ప్రగతితో వార్డులకు కొత్తశోభ వస్తున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10, 11 వార్డుల్లో మంగళవారం సా యంత్రం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించా రు. దీనిని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుల్లూరి రామయ్యపల్లి, గండ్రపల్లి, మహబూబ్‌పల్లి, కుందూరుపల్లి, మంజూర్‌నగర్ గ్రామాల్లో వారు పర్య టించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుల్లూరి రామయ్యపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణ ప్రగతి మంచి కార్యక్రమం అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వార్డు సభ్యులు, వార్డు కమిటీ సభ్యు లు, ప్రత్యేకాధికారులు వార్డుల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. వార్డుల పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రజావసరాలకు ఉపయోగించాలన్నారు. కబ్జా కాకుండా కాపాడాలన్నారు. డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, మరుగుదొడ్ల నిర్మాణం, బతుకమ్మ ఆడేందుకు, పిల్లల ఆటల కోసం, పార్కుల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించుకుందామని, గోదావరి జలాలు త్వరలోనే ప్రతి ఇంటికీ అందుతాయని చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో వార్డుల అభివృద్ధికి రూ.58 లక్షలు మంజూరయ్యాయని, ఈ నిధులు ప్రతినెలా వస్తాయని వి వరించారు. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తే పట్టణం ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి కోసం అదనంగా 300 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వార్డుల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పచ్చదనంగా తయారు చేయాలని, ప్రజలందరూ విధిగా పట్టణ ప్రగతిలో పాల్గొనాలని కోరారు. వంద లో పది రూపాయలు మొక్కల పెంపకానికి ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. చెట్లను అకారణంగా కొడితే జైలు శిక్ష విధించే విధంగా కొత్త మున్సిపల్ చట్టంలో పొందుపరిచినట్లు వివరించారు. కరెంటు స్తంభాలు విరిగినా, వైర్లు వేలాడినా మరమ్మతుకు నిధులు మంజూరు చేయిస్తున్నామని చెప్పారు.
పట్టణ ప్రగతితో వార్డులకు కొత్తశోభ