డిస్కవరీ ఛానల్‌లో త్వరలో ప్రసారం కానున్న ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్' కొత్త ఎడిషన్ కోసం రజనీకాంత్ తో బేర్ గ్రిల్స్ పలు సాహసాలు చేయించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కర్ణాటకలోని బందిపూర్ నేషనల్ పార్క్‌లో మంగళవారం షూటింగ్ జరుపుకుంది. బేర్ గ్రిల్స్‌తో రజనీకాంత్ అటవీ ప్రాంతంలో సంచరించారు. ఇద్దరు కలిసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అటవీ ప్రాంతంలో సంచరించే సమయంలో రజినీ పట్టుతప్పి పడిపోయారు. ఆంతో ఆయన కాలికి, చేయికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందగా, రజనీకాంత్ మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయం చెప్పారు. నాకు పెద్ద గాయాలు ఏం కాలేదు. చెట్టుకొమ్మలు మాత్రం చేతులపై అక్కడక్కడ గీసుకున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ కార్యక్రమంలో నటించడం మంచి అనుభవాన్నిచ్చిందన్నారు. అయితే మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో కోసం మూడు రోజుల షెడ్యూల్ ప్లాన్ చేయగా, తొలి రోజే రజనీకాంత్ గాయపడడంతో ఆయన షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి చెన్నై వచ్చారు. మరి కొద్ది రోజులలో మళ్లీ ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.