సాంకేతికరంగంలో విశ్వనగరం హైదరాబాద్ మరో అడుగేసింది. భాగ్యనగరం వేదికగా గూగుల్ క్లౌడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా మంగళవారం ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు సాంకేతికరంగంలో అత్యాధునిక సేవల్ని అందించేందుకు ఈ కేంద్రం సాయపడుతుందని టెక్ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నది. క్లౌడ్ బదిలీ సేవలు, గూగుల్ క్లౌడ్‌లో పలు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేంద్రం ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపింది.